బన్నీ కోసం కథ పూర్తి చేసిన సుకుమార్ ?

Published on Sep 10, 2019 9:59 am IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సుకుమార్ మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథను రాశాడు, మహేష్ కు వినిపించాడు కూడా. కానీ మహేష్ కి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకంటే మంచి ఎంటర్ టైనర్ చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా సుకుమార్ ఆ స్మగ్లింగ్ నేపథ్యంలో కథను అల్లు అర్జున్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి.. బన్నీకి వినిపించి.. మొత్తానికి సినిమాను ఒకే చేసుకున్నాడు.అయితే బన్నీ ముందు ఓకే చెప్పిన… ఆ తరువాత వేరే కథ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా లవ్ స్టోరీ చేద్దామని సుకుమార్‌ తో అన్నారట.

దీంతో కొన్ని రోజులుగా సుకుమార్ ఓ లవ్ స్టోరీని రాస్తున్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More