బన్నీ కోసం కొత్తరకం లవ్ స్టోరీనా ?

బన్నీ కోసం కొత్తరకం లవ్ స్టోరీనా ?

Published on Aug 25, 2019 6:48 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సుకుమార్ బన్నకి ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథను చెప్పాడు. ఈ కథకే బన్నీ ముందు ఓకే చెప్పిన… ఇప్పుడు వేరే కథ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా లవ్ స్టోరీ చేద్దామని సుకుమార్‌ తో అన్నారట. దీంతో సుకుమార్ ఇప్పుడు ఓ లవ్ స్టోరీని రాసే పనిలో ఉన్నాడట.

అసలు సుకుమార్ మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథను రాశాడు, మహేష్ కు వినిపించాడు కూడా. కానీ మహేష్ కి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకంటే మంచి ఎంటర్ టైనర్ చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా సుకుమార్ ఆ స్మగ్లింగ్ నేపథ్యంలో కథను అల్లు అర్జున్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి.. బన్నీకి వినిపించి.. మొత్తానికి సినిమాను ఒకే చేసుకున్నాడు. కానీ బన్నీ కూడా ఆ కథకి చివరికీ నో చెప్పాడు. ఇప్పుడు మళ్లీ సుకుమార్ కొత్త కథ కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు