స్టైలిష్ స్టార్ బన్నీ నిన్న కుటుంబం సమేతంగా ఏఎంబి థియేటర్స్ లో సైరా మూవీని వీక్షించడమే కాకుండా మూవీపై మరియు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. కాగా నేడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో కలిసి సైరా విజయవంతమైనందుకు విందు ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ తో పాటు పరిశ్రమలోని ప్రముఖ నటులు, దర్శకులను ఈ పార్టీకి ఆహ్వానించడం జరిగింది.
చిరంజీవి, చరణ్ లతో పాటు మెగా హీరోలైన వరుణ్, ధరమ్ తేజ్, అల్లు శిరీష్ విందుకు హాజరై సందడి చేశారు. వారితో పాటు దర్శకులు వంశి పైడిపల్లి, హరీష్ శంకర్, హీరో శ్రీకాంత్, అఖిల్ అక్కినేని హాజరుకావడం జరిగింది. మామయ్య చిరంజీవి సైరా విజయాన్ని అల్లు అర్జున్ సెలెబ్రేట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.



