బన్నీ “ఐకాన్” నిర్ణయం తెలిస్తే ఫ్యాన్స్ కు పండగే

Published on May 30, 2019 9:30 am IST

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ విడుదలై దాదాపు ఏడాది దాటిపోయింది. కథా రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ,ఆశించినంతగా ఫలితం ఇవ్వలేదు. దానితో నెక్స్ట్ ఎటువంటి మూవీ చేయాలన్న సందిగ్ధంలో పడ్డ బన్నీ, విక్రమ్ కె కుమార్, సుకుమార్ ఇలా చాలా మంది డైరెక్టర్స్ చెప్పిన కథలు విని చివరికి త్రివిక్రమ్ తో కమిటై కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూలు వచ్చే నెల 4నుండి 30 రోజులు నిరవధికంగా సాగనుంది.

బన్నీ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా తెరకెక్కనున్న” ఐకాన్” అనే మూవీ ని కూడా బన్నీ ఓకే చేసాడంట. త్రివిక్రమ్ మూవీతో పాటు ఏకకాలంలో ఈ మూవీని కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడంట. త్రివిక్రమ్ మూవీని 2020 సంక్రాంతికి, దిల్ రాజు తో చేస్తున్న “ఐకాన్”అదే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని చూస్తున్నారట. కాబట్టి నెక్స్ట్ ఇయర్ బన్నీ తన ఫ్యాన్స్ ని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించనున్నాడన్న మాట.

సంబంధిత సమాచారం :

More