సొంతూర్లో స్టార్ హీరో సంక్రాంతి సంబరాలు !

సొంతూర్లో స్టార్ హీరో సంక్రాంతి సంబరాలు !

Published on Jan 15, 2019 4:57 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సంక్రాంతిని తన మామగారి ఊర్లో తన బంధువులతో జరుపుకుంటుంటారు. కానీ ఈ సంక్రాంతిని మాత్రం ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ తో తన తాతగారి సొంతూరు పాలకొల్లులో జరుపుకున్నారు. బన్ని సంక్రాంతి సంబరాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక బన్ని తన తరువాత చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా ఇది. కాగా ఈ సినిమా మార్చి నుండి షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు