లేటెస్ట్…స్టైలిష్ స్టార్ మైనపు విగ్రహం తో ఐకాన్ స్టార్!

లేటెస్ట్…స్టైలిష్ స్టార్ మైనపు విగ్రహం తో ఐకాన్ స్టార్!

Published on Mar 28, 2024 7:33 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో నేడు అల్లు అర్జున్ మైనపు విగ్రహంను ఆవిష్కరించారు. దీనిపై ఎంతో ఎగ్జైట్ అయిన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక గా సరికొత్త ఫోటో ను తన అభిమానులతో పంచుకున్నారు.

నేడు మైనపు విగ్రహం అవిష్కరణ అని, ప్రతి నటుడికీ ఇది మైలురాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేశారు. అల వైకుంఠపురములో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఐకానిక్ సీన్స్ కి సంబందించిన ఫోటో ను విగ్రహం గా అక్కడ పెట్టారు. విగ్రహం తో పాటుగా బన్నీ బ్యాక్ పోజ్ ఇచ్చారు. ఈ ఫోటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ, తదుపరి పుష్ప 2 ది రూల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు