“ఉప్పెన” టీంకు బన్నీ స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Mar 4, 2021 5:01 pm IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ఉప్పెన” బాక్సాఫీస్ దగ్గర ఎంతలా ఎగసి పడిందో తెలిసిందే. ఈ ముగ్గురికీ డెబ్యూ సినిమానే అయినా ఒక ట్రెండ్ సెట్టింగ్ హిట్ లా ఇది నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమా విడుదల కాబడిన నాటి నుంచి తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలు కూడా ఎంతో మెచ్చుకున్నారు.

అయితే యంగ్ టాలెంట్ ను ఎప్పుడూ ఆదరించడంలో ముందుడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”లో కాస్త బిజీగా ఉండగా లేట్ గానే ఈ సినిమాను చూడాల్సి వచ్చింది. నిన్ననే బన్నీ కోసం మేకర్స్ ఒక స్పెషల్ స్క్రీనింగ్ ను వేసి చూపించారు. ఇక చూసిన తర్వాత బన్నీ మొత్తం ఉప్పెన టీం కు తన స్పెషల్ కంగ్రాట్స్ ను తెలిపారు.

వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు సహా తన సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కు కూడా కంగ్రాట్స్ తెలిపి వారి అమేజింగ్ వర్క్ ను మెచ్చుకున్నారు. దీనితో ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెలిపి తమ ఆనందం వ్యక్తం చేశారు. మరి వీరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :