మరోసారి రిపీట్ కానున్న బన్ని – సుకుమార్ కాంబినేషన్

మరోసారి రిపీట్ కానున్న బన్ని – సుకుమార్ కాంబినేషన్

Published on Jun 6, 2014 3:30 PM IST

allau-arjun-sukumar
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి స్టార్డం మరియు సుకుమార్ కి డైరెక్టర్ గా తోలి విజయాన్ని అందించిన సినిమా ‘ఆర్య’. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో వీరిద్దరి కాంబినేషన్ కి కూడా అంటే క్రేజ్ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ‘ఆర్య 2’. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో మూడో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పటికే దీనికి సంబందించిన స్టొరీ లైన్ ని కూడా సుకుమార్ బన్నికి వినిపించడం, అది బాగా నచ్చి బన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. బన్ని – సుకుమార్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

మామూలుగా సుకుమార్ తన తదుపరి సినిమా ఎన్.టి.ఆర్ తో చేయాలి. కానీ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే పూరి జగన్నాధ్ సినిమాకి షిఫ్ట్ అవుతాడు. ఆ తర్వాత కూడా వేరే కమిట్ మెంట్స్ ఉండడం వల్ల సుకుమార్ బన్నితో సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

తాజా వార్తలు