బన్ని – త్రివిక్రమ్ సినిమా డబ్బింగ్ మొదలైంది.

బన్ని – త్రివిక్రమ్ సినిమా డబ్బింగ్ మొదలైంది.

Published on Jan 4, 2015 2:59 AM IST

Trivikram-alluarjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో శబ్దాలయా స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు ఇటివలే జరిగాయి. త్వరలో బన్ని డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ భాగ్య నగరంలో జరుగుతుంది. నిర్మాణంతర కార్యక్రమాలను జనవరి నెలలో పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బన్ని వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, అదా శర్మ, నిత్య మీనన్ హీరోయిన్లు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు