ప్యారిస్ చేరనున్న అలవైకుంఠపురంలో

Published on Sep 16, 2019 2:18 pm IST

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో షూటింగ్ ని జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. కొద్దిరోజుల క్రితం కాకినాడ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపిన చిత్ర బృందం, ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టూడియాలో వేసిన ఖరీదైన సెట్ లో షూటింగ్ జరపడం జరిగింది. తాజా వార్త ప్రకారం వచ్చేనెల మొదటివారంలో అలవైకుంఠపురంలో టీం తమ నెక్స్ట్ షెడ్యూల్ కొరకు ప్యారిస్ వెళ్లనున్నారని సమాచారం.

ప్యారిస్ వేదికగా కొన్ని కీలక సన్నివేశాలలో పాటు పాటల చిత్రీకరణ జరపాలని త్రివిక్రమ్ ప్రణాలిక వేశారట. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తుండగా, హీరో సుశాంత్,నివేదా పేతురాజ్, నవదీప్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఈ చిత్రం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More