సంక్రాంతి రేసు కు సిద్దమైన మరో పెద్ద సినిమా

Published on May 21, 2019 3:19 pm IST

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సమయంలో మూవీస్ కి ఉండే డిమాండ్ మరే సీజన్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెద్ద సినిమాల నిర్మాతలు, దర్శకులు సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు. ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాల విడుదల ఉంటే థియేటర్స్ అందుబాటులో ఉండే పరిస్థితి ఆంధ్ర తెలంగాణాలలో లేదు. 2020 సంక్రాంతి కి ఈ పోటీ మరీ తీవ్రతరం కానుంది.
ఇప్పటికే కే ఎస్ రవికుమార్-బాలకృష్ణ, మహేష్-అనిల్ రావిపూడి, సాయి ధరమ్-మారుతీ ల మూవీస్ తోపాటు రజని-మురుగదాస్ ల “దర్బార్” మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయని సమాచారం.
ఇవి చాలవన్నట్టు త్రివిక్రమ్-బన్నీ కంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ ని కూడా సంక్రాంతి బరిలోనే దించాలని నిర్మాతలు భావిస్తున్నారట.,కాని ఇన్ని పెద్ద సినిమాలను సంక్రాంతి కి విడుదల చేయడం కత్తిమీద సామే . ఇంత పోటీ మధ్య మరి ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More