ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజైంది. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ కలిసి నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా, “ఇష్టంగా” ఫేమ్ అర్జున్ మహీ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.
ఆడియో ప్రమోషన్స్ పార్ట్‌లో గతంలో దిల్ రాజు విడుదల చేసిన మాస్ బీట్ సాంగ్ ‘రెడ్డి మామ’ యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఊపులో, ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అనే యూత్‌ఫుల్ ట్రాక్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యం అందించగా, ఆర్ఆర్ ధృవన్ స్వరకర్తగా నిలిచినంత మాత్రానే కాదు స్వయంగా వాయిస్ కూడా ఇచ్చారు. లిరికల్ వీడియోలో గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీకి అనుగుణంగా చంద్రహాస్ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
పాట రిలీజ్ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ, “చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘గుంజి గుంజి’ని రిలీజ్ చేశాం. సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై వస్తున్న ఈ చిత్రానికి ధృవన్ చాలా మంచి సంగీతం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం నా ప్రాజెక్ట్కూ పనిచేస్తున్నారు. రోల్ రైడా అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఈ పాటను అందరూ ఎంజాయ్ చేసేలా చిత్రీకరించారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ద బెస్ట్” అన్నారు.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. రీలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
