అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో మూవీ పై బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ అప్ డేట్

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో మూవీ పై బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Nov 28, 2023 5:05 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మాస్ మూవీ పుష్ప 2 వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది. అయితే దీని తరువాత ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక మూవీ అలానే సందీప్ రెడ్డి వంగా తో మరొక మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్.

విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత గీత ఆర్ట్స్ 2 అధినేత బన్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు చేయనున్న మూవీ ఎంతో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కనుందని అన్నారు. ఇండియన్ మూవీ హిస్టరీ లో నిలిచేలా అద్భుతంగా త్రివిక్రమ్ అతి త్వరలో ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేయనున్నారని అన్నారు.

తొలిసారిగా ఈ మూవీ ద్వారా త్రివిక్రమ్ గారు పాన్ ఇండియన్ మూవీ చేస్తుండడంతో అందరి అంచనాలు అందుకునేలా అలానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా నచ్చేలా స్క్రిప్ట్ ఉంటుందని తెలిపారు. అయితే మొత్తంగా స్క్రిప్ట్ పూర్తి కావడానికి ఏడాదికి పైగా సమయం పట్టె అవకాశం ఉందని అన్నారు. ఇక బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని, ఒకవేళ ఇది ముందు సిద్ధం అయితే, దీని అనంతరం త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలిపారు బన్నీ వాసు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు