స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అల్లు అరవింద్, ఆయన సతీమణి నిర్మల మరియు బన్నీ భార్య స్నేహ, లిటిల్ బన్నీ అయాన్ లు తిరుపతి దగ్గర సందడి చేశారు
ఈ సందర్భంగా అయాన్ తలనీలాలను స్వామివారికి అర్పించారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు
2011లో బన్నీకి స్నేహతో వివాహం జరిగింది. అల్లు అయాన్ ఈ ఏడాది ఏప్రిల్ లో జన్మించాడు. బన్నీకి ఈ సంవత్సరం ‘రేసు గుర్రం’ సినిమా ద్వారా కెరీర్ బెస్ట్ కలెక్షన్లని అందుకున్నాడు
ప్రస్తుతం బన్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో ఒక చిత్రం నిర్మాణదశలో వుంది. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో యాక్షన్ ఎపిసోడ్ లను ముగించుకున్న ఈ చిత్ర బృందం ప్రస్తుతం చిన్న విరామం తీసుకుంటుంది


