“పుష్ప”లో బన్నీ వేరే లెవెల్ మాస్ అంతే..!

“పుష్ప”లో బన్నీ వేరే లెవెల్ మాస్ అంతే..!

Published on Mar 28, 2021 8:29 PM IST

Pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 18 ఏళ్ళు గడిచిన సందర్భంగా అతని అభిమానులు ఆన్లైన్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా తన గ్రాటిట్యూడ్ ను కూడా తెలియజేసిన బన్నీ లేటెస్ట్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే పక్కా మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో బన్నీ మేకోవర్ అంతా ఎలా ఉందో అందరికీ తెలిసిందే.

తన ప్రతీ సినిమాకు డిఫరెంట్ మేకోవర్ డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్స్ తో అదరగొట్టే బన్నీ “పుష్ప”లో మరో లెవెల్లో కనిపిస్తాడని ఇండస్ట్రీ వారు చెబుతున్నారు. మొన్నామధ్య సుకుమార్ చెప్పినట్టుగా ఈ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ ట్యాగ్ మర్చిపోతారని ఇక్కడ నుంచి కొత్త అల్లు అర్జున్ ని చూస్తారని చెప్పినట్టుగానే బన్నీ రోల్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దగా దానిని బన్నీ కూడా అంతకు మించిన స్థాయిలోనే ప్రెజెంట్ చేస్తున్నాడట.

ముఖ్యంగా తాను చిత్తూరు యాసలో పలికించే డైలాగ్ డెలివరీ సూపర్బ్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి మాత్రం పుష్ప తో బన్నీ నుంచి వేరే లెవెల్ మాస్ విట్నెస్ చెయ్యడం గ్యారంటీలా అనిపిస్తుంది. మరి ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు