బన్నీ రికార్డు ను ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమేనా!?

బన్నీ రికార్డు ను ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమేనా!?

Published on May 4, 2024 9:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చివరిసారిగా పుష్ప ది రైజ్ మూవీ లో కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం కి సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బన్నీ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం బుల్లితెర పై క్రియేట్ చేసిన రికార్డు చాలా అరుదైనది. ఈ చిత్రం అత్యధికం గా 29.4 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ చిత్రం కి చేరువలో సరిలేరు నీకెవ్వరూ (23.5), బాహుబలి 2 (22.7), శ్రీమంతుడు (22.5), పుష్ప ది రైజ్ (22.5) లు నిలిచాయి. అయితే అల వైకుంఠపురములో క్రియేట్ చేసిన రికార్డు ను కొత్త సినిమాలు ఏవీ కూడా బ్రేక్ చేయలేక పోయాయి. ఈ రికార్డు ఇక ఇలానే మిగిలిపోతుందా, లేక వేరే ఏదైనా సినిమా ఈ రికార్డు ను బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు