డిసెంబర్ 23 న బిజినెస్ మాన్ ఆడియో

డిసెంబర్ 23 న బిజినెస్ మాన్ ఆడియో

Published on Nov 24, 2011 4:53 PM IST


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తదుపరి చిత్రం ‘బిజినెస్ మాన్’. పూరి జగన్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 23 వ తారీకున విడుదల కాబోతోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం లో కాజల్ అగ్గార్వాల్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.

తమన్ సంగీత దర్శకత్వం లో ఈ చిత్రం ఆడియో ఒకే రోజున మూడు భాషలలో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మళయాళం భాషలలో బిజినెస్ మాన్ ఆడియో ను విడిదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రం జనవరి ౧౧ న ప్రపంచవ్యాప్తం గా విడుదల కాబోతోంది. పూరి జగన్ మరియు మహేష్ బాబు పోకిరి ఘన విజయం తరువాత కలిసి చేస్తున్న మొట్ట మొదటి చిత్రం ఇదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు