డబ్బింగ్ జరుపుకుంటున్న బిజినెస్ మాన్

డబ్బింగ్ జరుపుకుంటున్న బిజినెస్ మాన్

Published on Nov 23, 2011 2:10 PM IST


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మాన్’ చిత్రం ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోస్ లో డబ్బింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో డబ్బింగ్ జరుగుతుంది. ఇటీవలే మహేష్ బాబు మరియు మరికొంత మంది యూనిట్ సభ్యులు పాటల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ నటిస్తోంది. బిజినెస్ మాన్ చిత్రాన్ని ఆర్.ఆర్,మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 11 జనవరి 2012 న విడుదల చేయబోతున్నారు. ముంబై నేపధ్యంగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బిజినెస్ మాన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు