బిజినెస్ మ్యాన్ కోసం పాట పాడనున్న మహేష్

బిజినెస్ మ్యాన్ కోసం పాట పాడనున్న మహేష్

Published on Nov 28, 2011 8:49 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ ను ఎలా ఆకట్టుకోవాలో పూరీ జగన్నాధ్ కు బాగా తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ చిత్రం బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ఒక పాట చిత్రీకరణ కోసం బ్యాంకాక్ మరియు థాయిలాండ్ వెళ్ళింది. ఇదిలా ఉండగా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పూరీ జగన్నాధ్ ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ ని పాడబోతున్నారు.మహేష్ బాబు తన చిత్రం కోసం పాట పాడటం ఇదే మొదటిసారి.

ముంబై మరియు గోవాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజోల్ నటించింది. బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. తమన్ సంగీతం అందించిన బిజినెస్ మ్యాన్ ఆడియో డిసెంబరు 23 న విడుదల కానుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు