డిసెంబరు 18 న బిజినెస్ మ్యాన్ ఆడియో

డిసెంబరు 18 న బిజినెస్ మ్యాన్ ఆడియో

Published on Nov 28, 2011 1:07 PM IST


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్’ చిత్రం 12 జనవరి 2012 న భారీ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుక డిసెంబరు 18 న హైదరాబాదులో జరగనుంది. తమన్ సంగీతం అందించిన ఈ ఆడియో తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల కానుంది. పోకిరి తర్వాత మహేష్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రాబోతున్న బిజినెస్ మ్యాన్ పై భారి అంచనాలున్నాయి.

ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు