బజ్..”పుష్ప” నుంచి మరో అప్డేట్ రానుందా.?

Published on Mar 28, 2021 8:40 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ మరియు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మరియు పాన్ ఇండియన్ చిత్రం కావడంతో దీనిపై అన్ని భాషల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా కొన్ని రోజుల కితమే విలన్ అప్డేట్ ను మేకర్స్ సీహరు. అలాగే గత కొన్ని రోజులు నుంచి వచ్చే నెలలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఓ గిఫ్ట్ ఉందని టాక్ వచ్చింది.

మరి బహుశా దానిపైనో ఏమో కానీ మళ్ళీ లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది ఈసారి కూడా బిగ్ అప్డేట్ నే మేకర్స్ చెప్పనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి అది బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే టీజర్ కోసమా లేక ఏదన్నా గ్లింప్స్ వదులుతారో అన్నది చూడాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :