బజ్ : రేపు నాని ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ?

బజ్ : రేపు నాని ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ?

Published on Feb 24, 2024 12:00 AM IST


స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రేపు నాని బర్త్ డే సందర్భంగా సరిపోదా శనివారం నుండి ఒక గ్లింప్స్ రానున్నట్లు ఇప్పటికే ఆ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం రేపు నాని నెక్స్ట్ మూవీకి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నానితో ఓజి దర్శకుడు సుజీత్, బలగం దర్శకుడు వేణు ల సినిమాలు ఓకే అయ్యాయని ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిలో ఒక సినిమా యొక్క అనౌన్స్ మెంట్ రేపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి పక్కాగా అది ఏమిటనేది తెలియాలి అంటే రేపు ఉదయం వరకు వేచి చూడల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు