“కల్కి” కోసం “హను మాన్”!?

“కల్కి” కోసం “హను మాన్”!?

Published on May 22, 2024 2:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో దిగ్గజ నటులు కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ లు నటిస్తున్న “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి.

మరి ఈ సినిమా నుంచి సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా రేపు గ్రాండ్ గా రామోజీ ఫిల్మ్ సిటీ లో బుజ్జి ని పరిచయం చేస్తూ ఈవెంట్ చేస్తున్నారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం మన టాలీవుడ్ సూపర్ హీరో “హను మాన్” తేజ సజ్జ హోస్ట్ చేయనున్నాడని తెలుస్తోంది.

మరి గతంలోనే ఓసారి ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రానికి తేజ సజ్జ హోస్ట్ చేయనున్నాడు అని టాక్ వచ్చింది కానీ అది అవ్వలేదు. ఫైనల్ గా కల్కి విషయంలో మరోసారి వినిపిస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తేజ సజ్జ ప్రస్తుతం మరో భారీ చిత్రం “మిరాయ్” చేస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు