బజ్ : బాలీవుడ్ స్టార్ యాక్టర్ తో ‘హను మాన్’ డైరెక్టర్ మూవీ ?

బజ్ : బాలీవుడ్ స్టార్ యాక్టర్ తో ‘హను మాన్’ డైరెక్టర్ మూవీ ?

Published on Mar 5, 2024 3:01 AM IST

ఇటీవల పాన్ ఇండియన్ మూవీ హను మాన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన ప్రశాంత్ వర్మ, ఆ మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో కూడా హను మాన్ మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. అతి త్వరలో దీనికి సీక్వెల్ అయిన జై హను మాన్ తెరకెక్కించే ప్లానింగ్స్ లో ఉన్నారు ప్రశాంత్ వర్మ.

విషయం ఏమిటంటే, అతి త్వరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఒక భారీ పేట్రియాటిక్ యాక్షన్ మూవీ తెరకెక్కించనున్నారని, స్వాతంత్రోద్యమ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ యొక్క కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్లు లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల బజ్. అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాజక్ట్ ఫిక్స్ కునుకు అయితే ప్రశాంత్ వర్మ పెద్ద అవకాశం అందుకున్నట్లే అంటున్నాయి సినీ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు