బజ్ : ఆ రెండింటిలో ఏది ముందు అనే దానిపై బోయపాటి క్లారిటీ ఇవ్వాల్సిందే

బజ్ : ఆ రెండింటిలో ఏది ముందు అనే దానిపై బోయపాటి క్లారిటీ ఇవ్వాల్సిందే

Published on Feb 23, 2024 1:22 AM IST

టాలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల ఉస్తాద్ రామ్ హీరోగా పాన్ ఇండియన్ మూవీ స్కంద తెరకెక్కించారు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద కి థమన్ సంగీతం అందించారు. ఇటీవల ప్రముఖ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాని ఫిక్స్ చేసుకున్న బోయపాటి మరోవైపు బాలయ్య కోసం అఖండ 2 మూవీ స్టోరీ కూడా సిద్ధం చేస్తున్నారు.

అయితే గీతా ఆర్ట్స్ వారి మూవీ అల్లు అర్జున్ తో చేస్తారని టాక్. ఇక బాలయ్య అఖండ ని కూడా ఒక ప్రముఖ సంస్థ నిర్మించనుందట. అయితే మ్యాటర్ ఏమిటంటే, అసలు ఈ రెండింటిలో బోయపాటి శ్రీను ఏది ముందు మొదలెడతారు అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. కొందరేమో అల్లు అర్జున్ మూవీ అంటుంటే మరికొందరేమో అఖండ 2 అంటున్నారు. మరి బోయపాటి తదుపరి పక్కాగా ఏ మూవీని మొదలెడతారు అనే దానికి సమాధానం దొరకాలి అంటే ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు