వైరల్ అవుతోన్న ‘వెంకీ మామ’ మేకింగ్ వీడియో !

వైరల్ అవుతోన్న ‘వెంకీ మామ’ మేకింగ్ వీడియో !

Published on Aug 2, 2019 11:30 PM IST

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా నిన్న దర్శకుడు బాబీ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం నుండి చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయితే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వీడియోలో వెంకీ – చైతు లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై మొత్తానికి ఈ వీడియో బాగానే అంచనాలు పెంచింది. ఇక ఆగస్టు 15 నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. విడుదల తేదీని అతి త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు