బజ్ : రజినీకాంత్ జైలర్ సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ ?

బజ్ : రజినీకాంత్ జైలర్ సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ ?

Published on Apr 13, 2024 12:00 AM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ గత ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ యాక్షన్ మూవీలో రజిని యాక్టింగ్ తో పాటు అనిరుద్ సంగీతం బీజీఎమ్, నెల్సన్ టేకింగ్ వంటి అంశాలకు అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అయితే జైలర్ కి సీక్వెల్ ఉండనుందని, దాని గురించి వివరాలు త్వరలో వెల్లడవుతాయని కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ వైరల్ అవుతోంది.

ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం జైలర్ సీక్వెల్ కి హుకుం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జూన్ ని ప్రారంభించి వచ్చే ఏడాది జనవరిలో మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారట. త్వరలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్నారు తన కెరీర్ 171వ షూట్ లో పాల్గొననున్నారు రజినీకాంత్. జైలర్ ని మించేలా హుకుం మూవీ మరింత గ్రాండియర్ గా సాగనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు