బజ్ : ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ముందు చరణా లేక ఎన్టీఆరా ?

బజ్ : ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ముందు చరణా లేక ఎన్టీఆరా ?

Published on Mar 26, 2024 10:35 PM IST

బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సంజయ్ లీల భన్సాలీ నుండి మూవీ వస్తుంది అంటే నార్త్ తో పాటు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా కొంత ఇంట్రెస్ట్ నెలకొని ఉంటుంది. ఆ విధంగా మొదటి నుండి తన సినిమాలతో ఆడియన్స్ మనసులో మంచి పేరు సంపాదించారు సంజయ్.

ఇటీవల అలియా భట్ తో గంగూభాయ్ ఖతీయవాడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మరొక విజయం అందుకున్న అయన మన టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లతో సినిమాలు చేయనున్నారు అంటూ కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసాయి. చరణ్ తో ఆయన మూవీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని ముందు వార్తలు రాగా, ఎన్టీఆర్ తో కూడా ఒక మూవీ చేయనున్నారు అంటూ వార్తలొచ్చాయి.

ఇక తాజాగా రణబీర్ కపూర్, అలియా భట్ తో తన నెక్స్ట్ మూవీ లవ్ అండ్ వార్ అనౌన్స్ చేసారు సంజయ్ లీల భన్సాలీ. అయితే మరి ఇంతకీ ఆయనతో మన గ్లోబల్ స్టార్ హీరోల సినిమాలు ఉంటాయా లేదా అనేది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం లవ్ అండ్ వార్ అనంతరం సంజయ్ లీల భన్సాలీ వీరిద్దరిలో ఒకరితో మూవీ చేసే ఛాన్స్ ఉందని టాక్. మరి దానికి పక్కాగా సమాధానం కావాలి అంటే మరికొన్నాళ్లు ఆగకతప్పదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు