బజ్ : చిరంజీవి, నాగార్జున ల నెక్స్ట్ మూవీస్ లో హీరోయిన్ గా ఆ స్టార్ నటి ?

బజ్ : చిరంజీవి, నాగార్జున ల నెక్స్ట్ మూవీస్ లో హీరోయిన్ గా ఆ స్టార్ నటి ?

Published on Dec 11, 2023 11:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట తో తన కెరీర్ 156వ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో మెగాస్టార్ కి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష కనిపంచనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

అయితే ఇది మాత్రమే కాక అతి త్వరలో నాగార్జున హీరోగా రూపొందనున్న లవ్, యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కూడా ఆమెనే హీరోయిన్ గా ఆ మూవీ మేకర్స్ కూడా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల మేకర్స్ నుండి వీటికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇటీవల విజయ్ తో త్రిష నటించిన లియో మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుని ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం థలా అజిత్ కుమార్ సరసన విడాముయార్చిలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు