క్రేజీ బజ్.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సక్సెస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి వార్త వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలోని క్యాస్టింగ్ గురించి తాజాగా ఓ క్రేజీ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌తో మెరిసిన ఆలియా, మరోసారి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం కానుందని టాక్. దీంతో వీరి మధ్య ఈసారి ఎలాంటి సీన్స్ వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తుందనే వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Exit mobile version