‘పెద్ది’ తర్వాత మెగా 158లో ఛాన్స్ పట్టేసిన ఏఆర్ రెహమాన్..?

‘పెద్ది’ తర్వాత మెగా 158లో ఛాన్స్ పట్టేసిన ఏఆర్ రెహమాన్..?

Published on Jan 6, 2026 11:00 PM IST

Chiranjeevi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేయగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.

ఇక ఈ సినిమా తర్వాత ఏఆర్ రెహమాన్ మరో టాలీవుడ్ సినిమాకు సంగీతం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మరో మెగా హీరో సినిమా కావడం విశేషం. దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కెరీర్‌లోని 158వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతను ఏఆర్ రెహమాన్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ జోరందుకుంది.

దీంతో రామ్ చరణ్ తర్వాత, మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) సంగీతం అందిస్తూ బ్యాక్ టు బ్యాక్ మెగా ప్రాజెక్టులు చేయనున్నాడు ఈ వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్. మరి నిజంగానే ఆయన చిరు 158వ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు