‘రామాయణ’ కోసం హాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. బిటౌన్‌లో చక్కర్లు కొడుతున్న న్యూస్..!

Ramayana

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’(Ramayana) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుండగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ మొదలుకొని స్టార్ టెక్నీషియన్ల వరకు పనిచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా వర్క్ చేయబోతున్నట్లు బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రామయణ చిత్రానికి ఎడిటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామాయణ చిత్రాన్ని నోలన్‌కు చూపెట్టి ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకున్నాక ఫైనల్ కాపీ రెడీ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆయన ఏదైనా మార్పులు చేర్పులు చెబితే వాటిని పాటించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. నిర్మాత నమిత్ మల్హోత్రాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ కంపెనీ నోలన్ చిత్రాలకు వర్క్ చేసింది.

ఈ సాన్నిహిత్యంతోనే నమిత్ మల్హోత్రా ఇలా తన రామాయణ చిత్రాన్ని నోలన్‌కు చూపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, ఈ వార్తలతో బిటౌన్‌లో ఒక్కసారిగా రామాయణ మళ్లీ ట్రెండ్ అవుతుంది. మరి నిజంగానే రామాయణ కోసం నోలన్ ఎడిటర్‌గా మారుతాడా.. అనేది వేచి చూడాలి.

Exit mobile version