మాస్ మహారాజా రవితేజ త్వరలోనే ‘ఇరుముడి’ అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు 14 కోట్ల రూపాయల భారీ ధరకు సొంతం చేసుకుంది. రవితేజకు ఈ సినిమా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.


