యష్‌కు ఇక మళ్లీ ప్రశాంత్ నీల్ మాత్రమే సక్సెస్ ఇవ్వగలడా..?

యష్‌కు ఇక మళ్లీ ప్రశాంత్ నీల్ మాత్రమే సక్సెస్ ఇవ్వగలడా..?

Published on Sep 9, 2026 1:00 AM IST

బాక్సాఫీస్ వద్ద ‘టాక్సిక్’ దారుణంగా నిరాశపరిచినప్పటికీ, రాకింగ్ స్టార్ యష్ పాన్-ఇండియా స్టార్‌డమ్ మాత్రం చెక్కుచెదరలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తెచ్చుకున్న గుర్తింపు కారణంగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. సరైన కథ పడితే యష్‌ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమవుతుందని ఈ వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం యష్ కున్న క్రేజ్‌ను పూర్తిస్థాయిలో వాడుకునే కథలు అందించేంత టాలెంట్ ఒక్క టాలీవుడ్‌లోనే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, తనను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మళ్లీ జతకట్టడమే యష్‌కి ఉత్తమమైన మార్గమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘కేజీఎఫ్ 3’ కోసం ప్రశాంత్ నీల్ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు వేచి చూసినా, ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు