పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే, న్యూ ఇయర్ సందర్భాన్ని ప్రత్యేకంగా ఉపయోగించుకోవడం వంగా స్టైల్‌గా మారుతోంది. గతంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్‌ను న్యూఇయర్ నైట్ విడుదల చేసి సంచలనం సృష్టించిన ఆయన, ఇప్పుడు అదే ప్యాటర్న్‌ను ‘స్పిరిట్’ విషయంలో కూడా ఫాలో అవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ న్యూఇయర్ నైట్‌కే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్కు సంబంధించిన షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. అంతకుముందు విడుదలైన వాయిస్ ప్రోమో భారీ స్పందన పొందడంతో, ఇప్పుడు పోస్టర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేసినట్టే, ప్రభాస్‌తో ‘స్పిరిట్’ కూడా భారీ ఇంపాక్ట్ సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.
