రామ్ పోతినేనితో ‘హిట్’ భామ.. కలిసొచ్చేనా..?

రామ్ పోతినేనితో ‘హిట్’ భామ.. కలిసొచ్చేనా..?

Published on May 19, 2026 11:00 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన కొత్త చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కూడా రామ్ స్వయంగా అందించడం విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోవడానికి సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘కేజీయఫ్’ ఫేమ్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసేందుకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఆమె వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తోంది. నాని సరసన ‘హిట్-3’ మూవీలో నటించిన శ్రీనిధి మంచి సక్సెస్ అందుకుంది. రామ్ సరసన శ్రీనిధి నటిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని కృష్ణ పోతినేని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు