చేతులు కలుపుతున్న థమన్-అనిరుధ్.. అంతా ఆ స్టార్ కోసమే..?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న థమన్, అనిరుధ్ రవిచందర్ ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడం కోసం నిర్మాత దిల్ రాజు వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలను సమకూర్చనుండగా, అనిరుధ్ తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాడట. రికార్డు బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఈ మ్యూజికల్ కాంబోపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఏదేమైనా ఈ కాంబో నిజంగా సెట్ అయితే మాత్రం మ్యూజిక్ లవర్స్‌కు పండగనే చెప్పాలి.

Exit mobile version