బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’(Dhurandhar) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా స్పై యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు ‘ధురంధర్ ది రివెంజ్’ అంటూ సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. 2026 మార్చి 19న ‘ధురంధర్ 2’(Dhurandhar 2) చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. దీంతో మార్చిలో రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వీటిలో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’(Dacoit) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అదే రోజు ధురంధర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పలు భాషల్లో రిలీజ్ కానుండటంతో ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రాన్ని వాయిదా వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వాయిదా వార్తలపై డెకాయిట్ చిత్ర యూనిట్ ఏదైనా స్పందిస్తారా అనేది చూడాలి. ఇక డెకాయిట్ చిత్రంలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా షేనియల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.


