లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?

Youth 2 1

కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘యూత్’ ఇటీవల రిలీజ్ అయ్యింది. అనీష్మా అనిల్ కుమార్, ప్రియాంషి యాదవ్ మరియు మీనాక్షి దినేష్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా, యువతను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం తమిళంలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల వసూళ్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు, తమిళంతో పాటు ప్రధాన భారతీయ భాషలన్నింటిలోనూ ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే, దీనిపై అటు నిర్మాణ సంస్థ నుండి గానీ, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుండి గానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో దేవదర్శిని, సూరజ్ వెంజరామూడు వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. పార్వతా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు స్ట్రీట్ బాయ్ స్టూడియోస్ బ్యానర్లపై అరుప్పయ్య సి. రామ్ మరియు సులోచన కుమార్ ఈ సినిమాను నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది.

Exit mobile version