బజ్ : ‘ప్రేమలు’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ఆ ఓటిటి సంస్థ ?

బజ్ : ‘ప్రేమలు’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ఆ ఓటిటి సంస్థ ?

Published on Feb 29, 2024 1:06 AM IST

ఇటీవల మలయాళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ యువతని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. నస్లెన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ మూవీలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్ మరియు మీనాక్షి రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించిన ఈ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహద్ ఫాసిల్ గ్రాండ్ గా నిర్మించారు. విషయం ఏమిటంటే, తాజా బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని పై త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా ఈ మూవీని మార్చి 8న రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు