మెగాస్టార్ కెరీర్ లోనే హైలెట్ సీక్వెన్స్

మెగాస్టార్ కెరీర్ లోనే హైలెట్ సీక్వెన్స్

Published on Apr 22, 2024 9:45 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఐతే, లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే కాకుండా, మెగాస్టార్ సినీ కెరీర్ లోనే హైలెట్ గా నిలిచిపోతుందని టాక్. మరి ఈ వార్త నిజమైతే, చిరంజీవి అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది.

కాగా UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025 న విడుదల కాబోతుంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. అన్నట్టు సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు