బజ్ : వెంకటేష్ 76 లో హీరోయిన్ గా ‘గుంటూరు కారం’ బ్యూటీ ?

బజ్ : వెంకటేష్ 76 లో హీరోయిన్ గా ‘గుంటూరు కారం’ బ్యూటీ ?

Published on Mar 3, 2024 3:02 AM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ అయిన కెరీర్ 76వ మూవీని యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ మంచి కామెడీతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

ఇక ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలో రానుండగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో ఇటీవల గుంటూరు కారంలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆకట్టుకున్న యువ నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనున్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందట. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే వెంకటేష్ ఫ్యాన్స్ ని కూడా అలరించేలా మూవీ యొక్క స్క్రిప్ట్ ని అద్భుతంగా సిద్ధం చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు