చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’. ప్రేమకథలో ఉండే భిన్న కోణాలు, వివిధ వయసులలో కలిగే ప్రేమ భావాలు, ప్రేమకు అడ్డుగా నిలిచే వయసు, కులం, మతం, హోదా వంటి విషయాలన్నిటినీ టచ్ చేస్తూ దర్శకుడు మహా వెంకటేష్ చేసిన స్క్రీన్ ప్లే మాయ అబ్బురపరిచింది. ఈ చిత్రం అనేక వేదికలపై ప్రదర్శించబడింది. సమాజంలోని వాస్తవ సంఘటనలకు దగ్గరగా దర్శకుడు ఎంచుకున్న పాత్రలు, నటులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవిత పాత్రలు మన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ అవార్డు విన్నింగ్ మూవీ తమిళంలో రీమేక్ అవుతుంది. కేర్ ఆఫ్ కాదల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు . ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు హేమాంబర్ జాస్తి తెరకెక్కిస్తున్నారు. ఎమ్ రాజశేఖర్, కె జీవన్, ఐ బి కార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారట. మరి తమిళంలో ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధిస్తుందో చూడాలి.


