విజయ్ దేవరకొండకు కలిసిరాని జోనర్.. ధనుష్‌కు కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండకు కలిసిరాని జోనర్.. ధనుష్‌కు కలిసొస్తుందా..?

Published on Nov 15, 2026 2:00 AM IST

‘అమరన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందిస్తున్న ధనుష్ చిత్రం ‘ఓం’పై మొదటి నుంచీ మంచి అంచనాలు నెలకొన్నాయి. మమ్ముట్టి, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించడం, సాయి అభ్యంకర్ సంగీతం, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు భారీ బజ్ ఏర్పడింది. అయితే, ట్రైలర్ చూసిన నెటిజన్లు ఈ సినిమా కథను ఇప్పటికే ఊహించేస్తున్నారు.

ఐపీఎస్ అధికారిణి సాయి పల్లవి ఆదేశాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ మమ్ముట్టి గ్యాంగ్‌లోకి కోవర్ట్‌గా వెళ్లిన ధనుష్, పోలీసుల అకృత్యాలను చూసి వారికే ఎదురుతిరిగి మమ్ముట్టితో చేతులు కలుపుతాడని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కథాంశం విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాకు, అల్లు అర్జున్ ‘పుష్ప’ ఎర్రచందనం నేపథ్యాన్ని తలపించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్రైలర్‌లోనే అసలు కథనంతా బయటపెట్టడం చిత్ర బృందం చేసిన పెద్ద పొరపాటని, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తన స్క్రీన్‌ప్లేతో ఏవైనా కొత్త మలుపులు, సర్‌ప్రైజ్‌లు జోడించకపోతే సినిమా రొటీన్‌గా మారే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. కింగ్‌డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ చేయలేని మ్యాజిక్ ఓం సినిమాతో ధనుష్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు