ఐస్ క్రీమ్ సినిమా దృశ్యం వేడిని తట్టుకోగలదా?

ఐస్ క్రీమ్ సినిమా దృశ్యం వేడిని తట్టుకోగలదా?

Published on Jul 11, 2014 12:20 PM IST

ice
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమా రేపు విడుదలకానుంది. హిట్ కొట్టి చాన్నాళ్ళు అయిన రామూ ప్రస్తుతం ఫామ్ లో లేడనే చెప్పాలి. కాబట్టి ఈ కారణం చేత, సినిమాలో స్టార్లు లేకపోవడం వలన ఐస్ క్రీమ్ కి అంతగా ఆదరణలేదని చెప్పాలి

ప్రస్తుతం ‘దృశ్యం’ మంచి హిట్ అయ్యి అందరి మన్ననలను పొందుతుంది. ఇంత మంచి సినిమాకు ఎదురుగా నిలిచి ఐస్ క్రీమ్ వీక్షకుల మదిని దోచగలదా అన్న ప్రశ్న ట్రేడ్ పండితుల మదిలో మెదులుతుంది

ఈ సినిమాలో నవదీప్, తేజస్వి లు జంటగా నటించారు. ఈ సినిమాకోసం రామూ విపరీతమైన పబ్లిసిటీ స్టంట్స్ ని వాడుకున్నాడు. మరి అవన్నీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొస్తాయో లేదో చూడాలంటే రేపటివరకూ ఆగాల్సిందే

తాజా వార్తలు