టాలీవుడ్లో ప్రస్తుతం దర్శకుడు మారుతి, సుజీత్‌ల మధ్య కంపారిజన్ జరుగుతోంది. ఈ ఇద్దరు డైరెక్టర్స్ ప్రభాస్‌తో సినిమాలు చేశారు. ‘సాహో’తో సుజీత్, ‘రాజా సాబ్’తో మారుతి ప్రభాస్‌తో సినిమాలు తెరకెక్కించారు. అయితే, సాహో యావరేజ్ చిత్రంగా నిలవగా, రాజా సాబ్ మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఇక సాహో తర్వాత సుజీత్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’ సినిమాను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ కమ్‌బ్యాక్‌తో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మారుతి కూడా సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మారుతి తన బలాబలాలను గుర్తించి ముందుకు సాగితే మళ్ళీ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు. తనదైన శైలిలో మంచి కామెడీ మరియు ఎమోషన్స్ ఉన్న కథను ఎంచుకుంటే ప్రేక్షకులను తిరిగి మెప్పించే అవకాశం ఉంటుంది. మరి మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎవరితో చేస్తాడో చూడాలి.
