మన హీరోలకు పాన్ ఇండియా కలిసొస్తుందా ?

Published on May 31, 2020 2:00 am IST

పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని మన స్టార్స్ తెగ ఆశ పడుతున్నారు. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు పాన్ తో తమ స్పాన్ పెంచుకోవాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టేశారు. బన్నీ కూడా పుష్పతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే స్టార్ హీరోలతో పాటు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.

చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న మంచు మనోజ్… ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా మూవీగానే తీసుకువస్తున్నాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

అలాగే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరుణ్ జోకార్, విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి మన హీరోలు పాన్ ఇండియా మూవీ అయితే చేస్తున్నారు గాని, మరి పాన్ ఇండియా స్టార్స్ గా ఎంతవరకు నిలబడతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More