సందీప్ రెడ్డి వంగ నుంచి ఇలాంటి సినిమా ఆశించవచ్చా?

సందీప్ రెడ్డి వంగ నుంచి ఇలాంటి సినిమా ఆశించవచ్చా?

Published on Dec 3, 2023 6:00 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తున్న దర్శకుల పేర్లలో మన టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు. మరి తాను తీసింది కేవలం మూడు చిత్రాలే అయినప్పటికీ పాన్ ఇండియా మార్కెట్ లో సాలిడ్ స్టాంప్ తనకి వేసుకున్నాడు. లేటెస్ట్ గా తాను చేసిన సినిమా “అనిమల్” మంచి వసూళ్లతో హిందీ సహా తెలుగులో కూడా దూసుకెళ్తుంది.

అయితే సందీప్ చాలా నాచురల్ గా సినిమాని చూపిస్తాడని ఏ ఫ్రేమ్ చూసినా కూడా ఇదొక సినిమా అన్నట్టుగా ఉండదు ఒక సరికొత్త ట్రెండ్ ని తాను సినిమాలో తీసుకొచ్చారని జక్కన్న రాజమౌళినే చెప్పారు. అయితే ఇది కాదనలేని వాస్తవం కానీ సందీప్ ఫిల్మోగ్రఫీలో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి.

అటు అర్జున్ రెడ్డి ఇక్కడ అనిమల్ లో చూసుకున్నా కూడా ఒక బాగా సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి హీరో పాత్ర కనిపిస్తుంది. దీనితో తనకున్న పవర్ పరపతితో తాను అనుకున్నవి చేయగలిగేవి ఒక సాలిడ్ యాటిట్యూడ్ తో హీరో చేసేస్తాడు. కానీ ఇదే సందీప్ రెడ్డి వంగ నుంచి ఓ సాధారణ లెవెల్లో కనిపించే హీరో పాత్రతో అయితే సినిమా ఎలా చేస్తాడు అనేది అనిమల్ తర్వాత చాలా మంది మైండ్ లో మెదిలిన ప్రశ్న.

ఆ హీరో రోల్ ని కూడా సందీప్ వీటి లెవెల్లోనే ప్రెజెంట్ చేయగలడా అనేది కూడా ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మరి తన లైనప్ లో చిత్రాల్లో ఇలాంటి సినిమా ఏమన్నా చేస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు