‘కేజీఎఫ్’ 1-2 విజయాల తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ ఆగస్టు 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. భారతదేశంలో ఇప్పటికే రూ. 15 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేయగా, ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఊపు పెరిగితే తొలిరోజే వంద కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే లాంగ్ రన్ చాలా కీలకం. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి తారలు నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతు మోహన్‌దాస్ తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా తగ్గకుండా నిర్మించిన ఈ సినిమా లాంగ్ రన్ ఫలితం మాత్రం ప్రీమియర్ షోల టాక్ మరియు ఆరంభ రివ్యూలపైనే ఆధారపడి ఉంది. మరి నిజంగానే యష్ ‘టాక్సిక్’తో మూడు అంకెల ఓపెనింగ్స్ సాధిస్తాడా అనేది చూడాలి.


