సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘అలా బోలియో’ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మరొకసారి తన మార్క్ హై ఎనర్జిటిక్ మరియు క్యాచీ ట్యూన్‌తో శ్రోతలను ఆకట్టుకున్నాడు. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అయితే ఈ పాటలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం మాత్రం నటి పూర్ణ అనే చెప్పాలి. స్క్రీన్ టైమ్ విషయంలో డైరెక్టర్ నెల్సన్ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షించింది. సాధారణంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ ఉన్న పాటలో ఫోకస్ అంతా ఆయనపైనే ఉంటుంది, కానీ ఈ పాటలో పూర్ణ తన ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ మరియు గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో హైలైట్‌గా నిలిచింది.
నెల్సన్ రజినీకాంత్ స్క్రీన్ టైమ్‌ను పరిమితంగా ఉంచి, పూర్ణకు ఎక్కువ స్పేస్ ఇవ్వడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విజువల్స్, కొరియోగ్రఫీ మరియు అనిరుధ్ కంపోజిషన్ తోడవడంతో ఈ పాట నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


